ఫిబ్రవరి 11.. ఉదయం 11:11.. గెట్ రెడీ పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి 100 రోజులు దాటిపోయింది.. కానీ ఇప్పటికీ కర్ణాటకలో ఆయన మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఆయన మరణం తట్టుకోలేక దాదాపు 20 మందికి పైగా అభిమానులు చనిపోయారు. కన్నడ ఇండస్ట్రీలో 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఒక్కసారిగా అలా అర్ధాంతరంగా మరణించడంతో అంతా నిర్ఘాంతపోయారు. ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. రోజూ సోషల్ మీడియాతో పునీత్ స్మరణ చేస్తూనే ఉన్నారు.
పునీత్ చేసే ఒక సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంటుంది. చనిపోయే సమయంలో కూడా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జేమ్స్ రెండోది ద్విత్వ. ఇందులో జేమ్స్ షూటింగ్ మరో 10 రోజులు బాకీ ఉందన్నపుడు ఆయన చనిపోయాడు. దాంతో ఎలాగోలా టెక్నాలజీ ఉపయోగించి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇందులో బాడీ బిల్డర్‌గా నటించాడు పునీత్. ఈ సినిమా కోసమే కొన్ని రోజులుగా కష్టపడ్డాడు ఈయన. గంటలు గంటలు జిమ్‌లోనూ వర్కవుట్స్ చేశాడు. ఈ సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. ఈ సినిమాను చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మొన్న జనవరి 26న జేమ్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పునీత్ ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు ఫ్యాన్స్. థియేటర్స్ ముందు బ్యానర్లు కట్టి పండగ చేసుకున్నారు. ఇప్పుడు జేమ్స్ టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11.. ఉదయం 11:11 టీజర్ విడుదల కానుంది. దాంతో పవర్ స్టార్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
తన అభిమాన హీరో పునీత్ నటించిన చివరి సినిమా ఎలా ఉండబోతోందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ పాత్రకు ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్తున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలను శివన్న పూర్తి చేశాడు కూడా. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటించడం విశేషం. సినిమాను మార్చి 17 పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?
Rajamouli: పునీత్ మరణం తర్వాతే ఆ విషయం తెలిసిందన్న రాజమౌళి”
మహేష్‌బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పెళ్లి సందD హీరోయిన్..
కెరీర్లో దూసుకెళ్తున్న టైంలో లతా మంగేష్కర్‌పై విషప్రయోగం.. చేసింది ఎవరో..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

