పునీత్ రాజ్‌కుమార్ మరణానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమా? గంటలోనే ఎలా ప్రాణాలు పోయాయి?

Puneeth rajkumar lives on | పునీత్ రాజ్‌కుమార్ .. కన్నడ ప్రేక్షకులు ఈ పేరు ఎలా మరిచిపోతారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన మరణించి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడి నామస్మరణ చేస్తున్నారు కన్నడ ప్రేక్షకులు. ముఖ్యంగా అభిమానులైతే పునీత్ లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పవర్ స్టార్ లేడనే విషయాన్ని తెలుసుకొని ఇప్పటికే 15 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అందులో దాదాపు 10 మంది గుండెపోటుతో చనిపోయారు. ఇదంతా ఇలా ఉంటే ఆయన చనిపోయిన తర్వాత.. అది ఎలా జరిగింది అని ఆరా తీయడం మొదలుపెట్టారు విశ్లేషకులు. మూడు రోజుల కింద పునీత్ చివరి సీసీటీవీ విజువల్స్ ఇవే అంటూ కొన్ని బయటకు వచ్చాయి.
అందులో అక్టోబర్ 29 ఉదయం 11 గంటల ఒక్క నిమిషానికి చాలా ఆరోగ్యంగా కనిపించాడు పునీత్ రాజ్ కుమార్. ఇంటి నుంచి అందరినీ విష్ చేస్తూ కారు వరకు సొంతంగా నడుచుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత గంటలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంటే కేవలం 60 నిమిషాల వ్యవధిలోనే పవర్ స్టార్ చనిపోయాడు అన్నమాట. ఇక్కడే డాక్టర్ ట్రీట్మెంట్ను తప్పు పడుతున్నారు అభిమానులు. తనకు అసౌకర్యంగా ఉంది అంటూ తన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు దగ్గరికి ముందుగా వెళ్లాడు పునీత్. అప్పటికి బీపీ, షుగర్, హార్ట్ అన్ని నార్మల్‌గానే ఉన్నాయని డాక్టర్ రమణ రావు చెప్పాడు. అయినా కూడా ఈసీజీ తేడా రావడంతో విక్రమ్ హాస్పిటల్‌కు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ప్రాథమిక చికిత్స ఎందుకు చేయలేదు.. ఒక మనిషి ప్రాణం పోయే అంత సీరియస్ కండిషన్లో ఉంటే డాక్టర్ ముందుగా గుర్తించలేడా.. పునీత్‌ను ఎందుకు అలర్ట్ చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అభిమానులు. డాక్టర్ సరైన చికిత్స చేశాడా లేదా అనేది పూర్తి విచారణ చేయాలని కోపగించుకుంటున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ విత్ రాజ్‌కుమార్.. హార్ట్ టచింగ్‌గా పవర్ స్టార్ పెయింటింగ్
Puneet Raj Kumar: చివరి క్షణాల్లోను యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. వీడియో వైరల్
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
Puneet Raj Kumar: పునీత్ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

