పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?

Puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్‌వుడ్‌కు మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలకు షాక్ అనే చెప్పాలి. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పునీత్ హఠాన్మరణం చెందడం అందర్నీ కలిచివేసింది. అందుకే ఆయన మరణ వార్త తెలియగానే టాలీవుడ్ సినీ పెద్దలు చాలామంది స్పందించారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ వంటి హీరోలు బెంగళూరు వెళ్లి మరి పునీత్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అతనితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న వయసులోనే పునీత్ వెళ్లిపోతాడని అస్సలు ఊహించలేదంటూ ఎమోషనల్ అయ్యారు. కానీ మన పొరుగున ఉన్న తమిళ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒక్కరు కూడా పునీత్ అంత్యక్రియలకు వెళ్లలేదు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త తెలియగానే కర్ణాటక మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. కన్నడ ఇండస్ట్రీ అయితే మూడు రోజులుగా పునీత్ నామస్మరణ చేసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కర్ణాటక సీఎం స్వయంగా దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. టాలీవుడ్ నుంచి కూడా చాలామంది హీరోలు వెళ్లి పునీత్ భౌతికకాయానికి నివాళులర్పించి వచ్చారు. కానీ కోలీవుడ్ నుంచి ఆమత్రం ఒక్కరు కూడా పవర్ స్టార్ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిజానికి తమిళ ఇండస్ట్రీలో విజయ్, సూర్య, విశాల్ వంటి హీరోలతో పునీత్ రాజ్‌కుమార్‌కు మంచి స్నేహం ఉంది. అయినా కూడా వాళ్లు అతని కడసారి చూపునకు రాలేదు. దీనికి కారణం కావేరీ జలాల సమస్య అని తెలుస్తోంది.
కర్ణాటక, తమిళనాడు మధ్య ఎన్నో సంవత్సరాలుగా కావేరీ జలాల సమస్య నడుస్తోంది.దీనిపై సినిమా ఇండస్ట్రీ కూడా ముందకొచ్చింది. తమిళ సినిమాలను కర్ణాటకలో విడుదల చేయకూడదని అప్పట్లో కన్నడ హీరోలు రోడ్డెక్కారు. ఇలాంటి సమయంలో పునీత్ అంత్యక్రియలకు హాజరైతే రాజకీయంగా సమస్యలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే కోలీవుడ్ హీరోలు ఎవరూ రాలేదని సోషల్ మీడయాలో ప్రచారం జరుగుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Puneeth Raj Kumar : పునీత్‌ను తలచుకుని ఎమోషన్ అయిన అల్లు అర్జున్
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

