పునీత్ రాజ్ కుమార్ సమాధి దగ్గరికి కదులుతున్న తమిళ హీరోలు..

suriya pays tribute to puneeth rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి వారం రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ అతని గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఆయన ఎంత పెద్ద హీరో కాకపోతే వారం రోజుల తర్వాత కూడా ఆయన సమాధిని చూడటానికి అభిమానులు లక్షల్లో తరలి వస్తారు. అయితే ఈయన మరణించినప్పుడు తమిళ హీరోలపై సోషల్ మీడియాలో విమర్శలు ఉవ్వెత్తున ఎగిశాయి. అంత పెద్ద నటశిఖరం చనిపోతే చివరి చూపు చూడటానికి కూడా మీకు మనసు రాలేదా అంటూ నెటిజన్లు తమిళ హీరోలపై సోషల్ మీడియాలో దండయాత్ర చేశారు.
అయితే పునీత్ చనిపోయిన 4 రోజుల తర్వాత తమిళ హీరోలు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన సమాధిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్, నాగార్జున బెంగళూరు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి విజయ్ సేతుపతి ( vijay sethupathi ), శివ కార్తికేయన్ ( shiva karthikeyan ) లాంటి హీరోలు ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జై భీమ్ ( Jai bhim ) సినిమాతో తాజాగా హిట్ కొట్టిన సూర్య ( suriya ) కూడా పునీత్ సమాధి దగ్గరికి వెళ్లి నివాళులర్పించాడు. పునీత్ లేడనే విషయం గుర్తుకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యాడు. మరోవైపు కంఠీరవ స్టేడియంలో ఖననం చేసిన పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకోవడానికి రోజుకు లక్షల్లో అభిమానులు అక్కడికి వస్తున్నారు. అధికారికంగా పునీత్ సమాధిని సందర్శించేందుకు అభిమానులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాడు శివన్న. దాంతో ఆయన అభిమానులు కంఠీరవ స్టేడియంలో బారులు తీరుతున్నారు.
ఇప్పటికే 5 లక్షల మంది అభిమానులు పునీత్ రాజ్‌కుమార్ ( Puneeth rajkumar ) సమాధిని చూసేందుకు వచ్చారని ఓ అంచనా. మొన్న ఆయన అంత్యక్రియలకు దాదాపు 11 లక్షల మంది హాజరయ్యారు. ఇదంతా చూస్తుంటే కర్ణాటక ప్రజలు పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పట్లో మర్చిపోయేలా కనిపించడం లేదు. ఒక మనిషిపై ఇంత అభిమానం ఎలా చూపిస్తారు.. అంతగా చూపిస్తున్నారు అంటే ఆయన ఎంత గొప్పవాడు అంటూ నాన్ కన్నడ ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneet Raj Kumar: చివరి క్షణాల్లోను యాక్టివ్‌గా కనిపించిన అప్పు.. వీడియో వైరల్
పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలకు తమిళ హీరోలు అందుకే రాలేదా..?
Puneet Raj Kumar: పునీత్ సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న సూర్య
Puneet Raj Kumar: పునీత్ చివరి సినిమా కోసం మేకర్స్ సరికొత్త ప్రయత్నం..!
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

