మహేష్‌బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పెళ్లి సందD హీరోయిన్..
Srileela | సినీరంగంలో కొందరు హీరోయిన్లకు సక్సెస్ రావడానికి చాలా సమయం పడుతుంది. అదే కొంత మందికి మాత్రం మొదటి సినిమాతోనే మంచి విజయంతో పాటు క్రేజ్‌ను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రోషన్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్గా నటించిన చిత్రం పెళ్లి సందD. గత ఏడాది దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీలీల తనదైన నటన, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం తర్వాత ఈమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. ఇప్పటికే ఈవిడ చేతిలో అరడజను సినిమాలున్నాయి. తాజాగా ఈమెకు మరో స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్రివిక్రమ్- మహేష్‌బాబు కాంబోలో వస్తున్న హ్యట్రిక్ చిత్రం #SSMB28లో సెకండ్ హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇందులో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డే కన్ఫార్మ్ అవ్వగా సెకండ్ హీరోయిన్గా శ్రీలీలను తీసుకోనున్నట్లు సమాచారం. హారికా అండ్ హాసినీ క్రయేషన్స్ పతాకంపై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గతశుక్రవారం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగాయి.ఇక శ్రీలీల ప్రస్తుతం రవితేజతో ధమాకాలో నటిస్తుంది. దీంతో పాటుగా నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

