లండన్: ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో చతేశ్వర్ పూజారా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో అతను నాలుగోసారి వంద ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు. మిడిల్సెక్స్తో హోవ్‌లో జరిగిన డివిజన్ మ్యాచ్‌లో ససెక్స్ తరపున ఆడుతున్న పూజారా 170 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటికే ఈ సీజన్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన పూజారా మరోసారి తన క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మిడిల్సెక్స్ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్పీడ్ బౌలర్ షహీన్ అఫ్రిదీని పూజారా ఎదుర్కొన్న తీరు హైలెట్. ప్రస్తుత సీజన్లో దూసుకువెళ్తున్న షహీన్ ను పూజారా తనదైన స్టయిల్లో అడ్డుకున్నాడు. చాలా ఓపిగా ఆడిన పూజారా.. ఓ అప్పర్ కట్ షాట్‌తో అందర్నీ స్టన్ చేశాడు. షహీన్ వేసిన ఓ బౌన్సర్‌ను అప్పర్ కట్‌తో సిక్సర్‌గా మలిచాడు. ఆ షాట్ ఆడిన పూజారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పూజారా, షహీన్ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోను కౌంటీ చాంపియన్‌షిప్ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ బాల్ అండ్ బ్యాట్ ఫైట్‌ను మీరూ వీక్షించండి.
Make yourselves comfortable and watch every ball of Shaheen Afridi 🆚 Cheteshwar Pujara 🤩 #LVCountyChamp pic.twitter.com/E6uVJopBQr
— LV= Insurance County Championship (@CountyChamp) May 7, 2022