ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమి కశ్మీర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన (PoK Protests)ప్రదర్శనలు జరుగుతున్నాయి. రెండో రోజుల ఆ ప్రదర్శనలను అడ్డుకునేందుకు బలగాలు రహదారులపై కంటేనర్లను పెట్టింది. అయితే ఓ బ్రిడ్జ్ వద్ద అడ్డంగా ఉన్న భారీ కంటేనర్‌ను ఆందోళనకారులు తొలగించి నదిలో పడేశారు. హింసాత్మకంగా మారిన నిరసనల్లో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. అవామీ యాక్షన్ కమిటీ(ఏసీసీ) ఈ ఆందోళన చేపడుతున్నది. పీవోకే ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ప్రభుత్వాన్ని ఏసీసీ విమర్శిస్తోంది. ఆందోళనలో భాగంగా మార్కెట్లు, షాపులు, స్థానిక వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఓ దశలో పాకిస్థానీ పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.
38 పాయింట్ల ఎజెండాతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పీవోకే అసెంబ్లీ పరిధిలో పాకిస్థాన్‌కు చెందిన కశ్మీరీ శరణార్థులకు ఉన్న 12 సీట్ల రిజర్వేషన్‌ను రద్దు చేయాలని ఏసీసీ డిమాండ్ చేస్తున్నది. 70 ఏళ్లుగా తమ ప్రాథమిక హక్కులను హరిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని మరింత ఇరుకునపెడుతామని ఏఏసీ నేత షౌకాత్ నవాజ్ మీర్ వార్నింగ్ ఇచ్చారు. పీవోకే పట్టణాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
#BREAKING: Pakistani forces today put containers in many parts of Pakistan Occupied Kashmir (PoK) to crush the civilian uprising. The protestors, thousands in number, managed to throw containers from the bridge into the river. Yesterday Pakistani forces killed 2 youth in PoK. pic.twitter.com/t3o5NLqrCi
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 30, 2025