జగిత్యాల, డిసెంబర్ 16 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మోసం చేసి అధికారంలోకి వచ్చిన తీరును వివరిస్తూ పాట పాడారు. ‘అందరినీ మోసం చేసి రేవంత్రెడ్డి.. కచ్చీరు ఏలుతున్నడే రేవంత్రెడ్డి’ ‘నాలుగు వేల పింఛినాని రేవంత్రెడ్డి.. అందరినీ మోసం చేసి రేవంత్రెడ్డి’ ‘అందరినీ మోసం చేసి రేవంత్రెడ్డి.. అందరినీ కా డు వెట్టనే రేవంత్రెడ్డి’ అని పాడుతూ నిరసన తెలిపారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ హామీ ప్రకారం రూ.10 వే ల గౌరవ వేతనం, మెనూ చార్జీలు ఇ వ్వాలని కోరారు. బిల్లులు విడుదల చేయకుండా వండ టం ఎలా? అని ప్రశ్నించారు.