LSG vs PBKS : ముల్లనూన్ స్టేడియంలో సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య(93), కూపర్ కొన్నొల్లీ(87) జోడీ ఆకాశమే హద్దుగా విధ్వంసం కొనసాగించగా లక్నో సూపర్ జెయింట్ బౌలర్లు చేష్టలుడుగిపోయారు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకి లేదా బౌండరీ గీత దాటించడమే లక్ష్యంగా వీరిద్దరూ చెలరేగారు. ఆఖర్లో మార్కస్ స్టోయినిస్(29) తుఫాన్ బ్యాటింగ్‌తో లక్నో పేసర్లను హడలెత్తించాడు. కుర్రాళ్లు చితక్కొట్టిన వేళ ఐపీఎల్లో పంజాబ్ రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసి.. 254 పరుగులతో పంత్ సేన ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని పెట్టింది.
ఐపీఎల్లో రికార్డుల మోతకు తెరదీసింది పంజాబ్ కింగ్స్. టోర్నీలో అజేయంగా దూసుకెళ్తున్న ఆ జట్టు ముల్లన్‌పూర్‌లో భారీ స్కోర్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌ను భయపెట్టింది. టాస్ ఓడినా పంజాబ్‌కు శుభారంభం దక్కకున్ను.. కుర్రాళ్లు శివాలెత్తిపోయారు. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(0)ను తొలి ఓవర్లోనే ఔటైనా.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు ప్రియాన్ష్ ఆర్య(93) చుక్కలు చూపించాడు. కూపర్ కొన్నొల్లీ(87) తో కలిసి విధ్వంసకాండ రచించిన ఈ కుర్రాడు మెరుపు అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. ఇద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదేయగా పంజాబ్ స్కోర్ రాకెట్ వేగంతో పరుగులు తీసింది.
Innings Break! #PBKS notch up the highest total of the season, scoring 254/7 🔥
Can #LSG scale this monumental task? 🤔
Scorecard ▶️ https://t.co/u5eUR1dSo2#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG pic.twitter.com/7YUJeYWVep
— IndianPremierLeague (@IPL) April 19, 2026
శతకాల దిశగా దూసుకెళ్లిన ఈ జోడీని ప్రిన్స్ యాదవ్(2-25) విడదీసి లక్నో్కు ఊరటనిచ్చాడు. ఆ వెంటనే ప్రియాన్ష్‌ను సిద్దార్థ్(2-35) ఔట్ చేయగా.. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(5) నిరాశపరిచాడు. అనంతరం నేహల్ వధేరా(13), మార్కస్ స్టోయినిస్(29), శశాంక్ సింగ్(17)లు స్కోర్ బోర్డును ఉరికించారు. ఆఖరి ఓవర్లో చివరి బంతికి స్టోయినిస్ రనౌటవ్వగా పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది.
🎥 Prince Yadav and M Siddharth stop the mayhem! ✋
Both Cooper Connolly and Priyansh Arya depart after a stand of 182 (80) 🤯
Updates ▶️ https://t.co/u5eUR1eqdA#TATAIPL | #KhelBindaas | #PBKSvLSG | @LucknowIPL pic.twitter.com/cTw6Ksdomw
— IndianPremierLeague (@IPL) April 19, 2026