NTR 31 | హాలీవుడ్ రేంజ్లో ప్రశాంత్ నీల్ ప్లానింగ్.. ఎన్టీఆర్ 31లో గ్లోబల్ స్టార్..?
NTR 31 | కేజీఎఫ్ (KGF) చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేస్తున్న తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటిని ఎన్టీఆర్ 31 (NTR 31) కోసం రంగంలోకి దించినట్లు టాక్ వినిపిస్తోంది.
NTR 31 | కేజీఎఫ్ (KGF) చిత్రంతో పాన్ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో చేస్తున్న తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ నటిని ఎన్టీఆర్ 31 (NTR 31) కోసం రంగంలోకి దించినట్లు టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ 31 కోసం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర బృందం ప్రియాంకను సంప్రదించినట్లు సమాచారం. ప్రియాంక చోప్రా ఇప్పటికే సిటాడెల్ (Citadel) లో యాక్షన్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ 31లో కూడా చాలా యాక్షన్ (action) సన్నివేశాలు ఉండటంతో అందుకోసం పీసీని సంప్రదించినట్లు చిత్రపరిశ్రమ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఎన్టీఆర్ (Jr NTR) తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎన్టీఆర్31 (NTR 31) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. రగ్గుడ్ లుక్ లో ఎన్టీఆర్ ని చూసి నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా ‘దేవర’ (Devara) లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అనిరుధ్ సంగీతాన్నందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక, ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే తారక్ ఎన్టీఆర్ 31 సినిమాను పట్టాలెక్కించనున్నాడు. వచ్చే ఏడాది మార్చ్‌లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
Also Read..
Reddit | రెడ్డిట్‌లో లేఆఫ్స్.. 5 శాతం ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైన సంస్థ
Adipurush | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కృతి సనన్, ఓం రౌత్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

