Reddit | రెడ్డిట్‌లో లేఆఫ్స్.. 5 శాతం ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైన సంస్థ
Reddit | ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) కూడా ఉద్యోగుల (employees) తొలగింపుకు సిద్ధమైంది.
Reddit | ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి కంపెనీలన్నీ వేలాది మంది ఉద్యోగుల్ని ఉన్నపలంగా పీకేశాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ (Reddit) కూడా ఉద్యోగుల (employees) తొలగింపుకు సిద్ధమైంది.
ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం రెడ్డిట్ ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగుల్ని కలిగిఉంది. అందులో దాదాపు 5 శాతం ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు (lay off) తెలుస్తోంది. కంపెనీ నిర్ణయంతో 90 మందిపై లేఆఫ్స్ (Lay Offs) ప్రభావం పడనుంది. ఇదే విషయాన్ని కంపెనీ సీఈవో స్టీవ్ హుఫ్‌మన్ (Steve Huffman) తమ ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా తెలియజేశారు.
ఇదే సమయంలో నూతనంగా నియమించుకునే సిబ్బందిని కూడా గణనీయంగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగానే మొదట 300 మంది కొత్తవాళ్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ సంఖ్యను 100కే పరిమితం చేసింది.
Also Read..
Tractor Crushes Car | కారుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. షాకింగ్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

