Srutihasan as adhya | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుంది. కాగా ఇవాళ శ్రుతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా సలార్ చిత్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ రివీల్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ నీల్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు.
శృతి హాసన్ ఇందులో ఆద్యగా కనిపించనుంది. తాజాగా విడుదలైన పోస్టర్ లో శ్రుతి హాసన్ అటు వైపు తిరిగి ఎవర్నో దీర్ఘంగా చూస్తున్నట్లు ఉంది. కాగా ప్రభాస్ ఈ చిత్రంలో తండ్రీ,కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.రవి బసూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎప్రిల్ 14న విడుదల చేయాలని భావించారు.కాని కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో ప్రశాంత్ నీల్ అదే తేదీన కేజీఎఫ్-2 ను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు.
Happy birthday @shrutihaasan.
— Prashanth Neel (@prashanth_neel) January 28, 2022
Thank u for being a part of #Salaar, and bringing in a tad bit of color to the sets !#HBDShrutiHaasan #Prabhas @VKiragandur @hombalefilms @HombaleGroup @IamJagguBhai@RaviBasrur @bhuvangowda84 pic.twitter.com/vkpwUd2f3j