యువ గోల్ఫర్, మైసూర్ అమ్మాయి ప్రణవి శరత్ ఉర్స్ భారత్‌కు అనూహ్య పతకం అందించింది. ఆసియా గేమ్స్ గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం గెలిచిన దేశ తొలి మహిళా గోల్ఫర్గా చరిత్రకెక్కింది. 23 ఏండ్ల ప్రణవి మహిళల టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్తోనూ మెరిసింది. శనివారం ముగిసిన వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఆమె అగ్రస్థానం అందుకుంది. నాలుగు రోజుల ఆట ముగిసేసరికి 15-అండర్ 265 స్కోరుతో టాప్ ప్లేస్‌తో గోల్డ్ అందుకుంది.
2002లో పురుషుల విభాగంలో శివ్ కపూర్ స్వర్ణం నెగ్గిన తర్వాత ఆసియాడ్ వ్యక్తిగత గోల్ఫ్‌లో భారత్ పసిడి పతకం దక్కడం ఇదే తొలిసారి. అనంతరం మహిళల జట్టుకు ప్రణవి రజతం అందించింది. ప్రణవి, అదితి అశోక్, దీక్షా దాగర్‌తో కూడిన భారత్ 546 పాయింట్ల ఓవరాల్ స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. ఆసియాడ్ చరిత్రలో భారత మహిళల గోల్ఫ్ జట్టుకు ఇది అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.