Prakash Raj | మీరు తప్పు చేస్తున్నారని మీకు కోర్టులు సరిగా చెప్పడం లేదా.. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు..? : ప్రకాశ్‌రాజ్
Prakash Raj | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) పై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై అతడు బయటకు వస్తున్నప్పటికీ.. ఇప్పటికే నమోదైన ఇతర కేసుల్లో మళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
Prakash Raj : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) పై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్‌పై అతడు బయటకు వస్తున్నప్పటికీ.. ఇప్పటికే నమోదైన ఇతర కేసుల్లో మళ్లీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ ఆయన విమర్శనాత్మకంగా ఎక్స్‌లో పోస్టుపెట్టారు.
‘అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. అరెస్ట్.. బెయిల్.. మళ్లీ అరెస్ట్.. మీరు తప్పు చేస్తున్నారని మీకు కోర్టులు స్పష్టంగా చెప్పడం లేదా..? మీ కక్షపూరిత రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు’ అని ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే వారిని అణచివేయడం ఎంతవరకు సాగుతుంది..? కోర్టు బెయిల్ ఇచ్చిన వెంటనే మరో కేసు తెరిచి వేధించడం సిగ్గుచేటు’ అని మండిపడ్డారు.
రావణ్ ఏలూరులో పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన తర్వాత పిఠాపురం పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. వెంటనే సర్పవరం పోలీసులు మరో పాత కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రావణ్‌పై మొత్తం 30 కేసులు ఉన్నాయని, ఇది స్పష్టమైన ప్రతీకార చర్య అని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. జనసేన కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్న ఘటనను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ‘ప్రశ్నిస్తే చంపేస్తారా..?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

