Prabhas supports Fish Venkat | టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే తన తండ్రి పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని ఎమోషనల్ అయ్యారు ఫిష్ వెంకట్ కూతురు స్రవంతి. ఆపరేషన్‌కు దాదాపు రూ.50 లక్షలు ఖర్చవుతుందని ప్రస్తుతం తాము వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా తమకు సాయం చేయాలని స్రవంతి కోరారు. అయితే ఈ విషయం నటుడు ప్రభాస్ వరకు వెళ్లగా అతడు వెంటనే స్పందించినట్లు తెలుస్తుంది.
ఈ విషయంపై ఫిష్ వెంకట్ కూతురు మాట్లాడుతూ.. ప్రభాస్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని, కిడ్నీ డోనర్ ఉంటే ఆపరేషన్‌కు సిద్ధం చేసుకోవాలని.. ఆపరేషన్‌కు అవసరమయ్యే ఖర్చంతా ప్రభాస్ భరిస్తాడని చెప్పినట్లు అతడి టీమ్ తనకు తెలిపిందని స్రవంతి మీడియాకు తెలిపారు.
ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి ‘కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చారని ఫిష్ వెంకట్ కూతురు తెలిపింది.#Prabhas pic.twitter.com/C8oJncn191
— Suresh PRO (@SureshPRO_) July 4, 2025