Salaar Movie | మరో రెండు రోజుల్లో సలార్ బిగ్ అప్డేట్?
Salaar Movie Update | ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘సాహో’, ‘రాధేశ్యామ్’ వంటి వరుస ఫ్లాప్‌లు ప్రభాస్ క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేదు. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘సలార్’ ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కేజీఎఫ్-2 ఘన విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానులంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభై నెలలు గుడుస్తున్న చిత్రానికి సంబంధించిన అపడేట్లు మాత్రం రావడంలేదు. ఈ విషయంలో మాత్రం డార్లింగ్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఓ అప్డేట్ను ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఆగస్టు 15 మధ్యాహ్నం 12.58 నిమిషాలకు ప్రకటించిన్నట్లు మేకర్స్ తెలిపారు. . కాగా ఈ అప్డేట్ సినిమా విడుదల తేదీ అని తెలుస్తుంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రభాస్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో తండ్రి, కొడుకులుగా నటించనున్నట్లు టాక్.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘తన్హాజీ’ ఫేం ఓ రౌత్ తెరకెక్కించాడు. దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని అశ్వినీదత్ రూపొందిస్తున్నాడు. వీటితో పాటుగా ప్రభాస్ తన 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు టాక్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

