
లండన్: దక్షిణాసియా నంబర్ వన్ సెలబ్రిటీగా రెబల్‌స్టార్ ప్రభాస్ నిలిచారు. ఈ ఏడాదికిగానూ బ్రిటన్ వార పత్రిక ఈస్ట్రన్ ఐ ఈ జాబితాను రూపొందించింది. గ్లోబల్ స్టార్లను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటిస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో బ్రిటిష్-పాక్ నటుడు రిజ్ అహ్మద్ నిలువగా.. మూడో స్థానంలో ప్రియాంక చోప్రా, నాలుగు స్థానంలో ఇండియన్ అమెరికన్ మిండీ కలింగ్, ఐదోస్థానంలో గాయని శ్రేయా ఘోషల్ నిలిచారు.