Adipurush | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ (Adipurush). మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి తానాజీ ఫేం ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 2023 జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. రావణాసురుడి (లంకేశ్)గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సాచెట్-పరంపర ఆదిపురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఆదిపురుష్ ఫైనల్ ట్రైలర్..