నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎం. ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థరెడ్డి పాత్రలో కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా, కృతిశెట్టి కథానాయికలు. శనివారం నితిన్ ఫస్ట్ఛార్జ్ను (ఫస్ట్‌లుక్) విడుదల చేశారు. ‘నా మొదటి ఛార్జ్ తీసుకోవడానికి ఇదే సరైన సమయం. సిద్ధార్థరెడ్డిగా బాధ్యతలు తీసుకున్నా. మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా’ అంటూ నితిన్ ట్విట్టర్లో తెలిపారు. ఫస్ట్‌లుక్‌లో నితిన్ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఓ జాతరలో జరిగే పోరాట నేపథ్యంలో ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తీర్చిదిద్దారు. ‘రాజకీయాంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. నితిన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: మహతి స్వరసాగర్, సంభాషణలు: మామిడాల తిరుపతి, నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, నిర్మాణ సంస్థలు: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్, రచన-దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి.