IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
IndiGo Flight | ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు (Power Bank) కారణంగా ఇండిగో విమానం (IndiGo Flight) లో మంటలు లేచాయి. దాంతో ఒక్కసారిగా విమానంలో కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది (Flight Crue) మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
IndiGo Flight : ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంకు (Power Bank) కారణంగా ఇండిగో విమానం (IndiGo Flight) లో మంటలు లేచాయి. దాంతో ఒక్కసారిగా విమానంలో కలకలం రేగింది. విమానం గాల్లో ఉండగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది (Flight Crue) మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నేపథ్యంలో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఇండిగో విమానం 6E6115 ఢిల్లీ నుంచి చెన్నైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా, ఓవర్ హెడ్ లగేజీ కంపార్ట్మెంట్లో ఉన్న ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి, విమానంలో అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ముందుజాగ్రత్త చర్యగా, పైలట్ విమానాన్ని సమీపంలోని హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వైపు మళ్లించారు. విమానం శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలను, ఆ పవర్ బ్యాంక్ ఏ కంపెనీకి చెందినది అనే వివరాలను సేకరిస్తున్నారు.
కాగా విమాన ప్రయాణాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలు, పవర్ బ్యాంకులవల్ల అగ్నిప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నందున, వీటిని కేవలం క్యాబిన్ బ్యాగేజీలోనే ఉంచాలని, విమానంలో ఛార్జింగ్ చేయరాదని విమానయాన నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిబంధనల ప్రాముఖ్యతను తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

