Portugal Cricket : టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలకు పాపులరైన పోర్చుగల్ క్రికెట్లోనూ రాణిస్తోంది. తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు వరల్డ్‌కప్ కలను నిజం చేసేందుకు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోసెస్ హెన్రిక్స్ (Moises Henriques)కు కెప్టెన్సీ అప్పగించింది.
క్రికెట్ ఆట ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. చైనా, ఒమన్, మలేషియా దేశాలు పలు లీగుల్లో రాణిస్తున్నాయి. ఈ దేశాలను అనుసరిస్తూ టీ20 ప్రపంచకప్ 2028 పోటీలకు సిద్ధమవుతోంది పోర్చుగల్. ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోసెస్ హెన్రిక్స్ సారథ్యంలోని 14 మందితో కూడిన బృందం ప్రపంచకప్ బెర్తు లక్ష్యంగా సాధన చేయనుంది. ఆసీస్ తరఫున హెన్రిక్స్ 4 టెస్టులు,16 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడు.
Former Australian all-rounder Moisés Henriques will lead Portugal as they attempt to qualify for the T20 World Cup for the first time. 🇵🇹 pic.twitter.com/dWpDl2NOCC
— Circle of Cricket (@circleofcricket) August 11, 2026
మోసెస్ పుట్టింది పోర్చుగల్‌లోని ఓ ద్వీపంలో. అతడి చిన్నతనంలోనే వాళ్ల కుటుంబం ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. దాంతో, అతడు అక్కడే దేశవాళీ క్రికెట్ ఆడి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో ఆర్సీబీ (RCB)కి ప్రాతినిధ్యం వహించాడు హెన్రిక్స్. యూరోపియన్ టీ20 లీగ్‌లో సైతం ఆడిన అనుభవం అతడి సొంతం. దాంతో, తమ ప్రాంతానికే చెందిన అతడికి కెప్టెన్సీ అప్పగించింది ఆ దేశ క్రికెట్ బోర్డు.
Former RCB all-rounder to captain Portugal in 2028 T20 World Cup qualifiers https://t.co/McT6ZZq2K4 pic.twitter.com/o5Xv5218fN
— Sportskeeda (@Sportskeeda) August 11, 2026
ఆగస్టు14 నుంచి 20 వరకూ ఫిన్లాండ్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ యూరోప్ ప్రాంతీయ క్వాలిఫయర్ సీలో పోర్చుగల్ తలపడనుంది. గ్రూప్ బీలోని ఇజ్రాయేల్, జర్మనీ, గ్రీస్, చెచియాలను ఢీ కొట్టనుంది యూరప్ టీమ్. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో 37వ స్థానంలో ఉంది పోర్చుగల్.
పోర్చుగల్ స్క్వాడ్: మోసెస్ హెన్రిక్స్(కెప్టెన్), క్రెగ్ కచోపా, ఎడ్వర్డ్ ఫ్లెమింగ్, క్రిస్టోఫర్ డె ఫ్రీటస్, రాహుల్‌కుమార్ హషు, సిరాజ్ ఉల్లాహ్ ఖాదీమ్, హర్దీప్ ఖుట్టాన్, జెరెమి మార్టిన్స్, ధవల్కుమార్ నొరోటమ్(వికెట్ కీపర్), జోర్డాన్ నెట్టో, కార్లోస్ నున్స్, సెబాస్టియన్ డి ఒలివీరా, ఉపెన్ షంటు, కామెరూన్ షెకిల్టన్.