Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Poonam Kaur | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌కు సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చినా, ఆయన సినిమా విడుదలైనా పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది.
Poonam Kaur | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్‌కు సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చినా, ఆయన సినిమా విడుదలైనా పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది. గతంలోనూ ఆయనపై పరోక్షంగా ఆరోపణలు చేసిన ఆమె.. ఈసారి మరింత ఘాటైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ఫేక్ గురూజీ’ అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా తన సినీ కెరీర్‌ను ముగించారని ఆరోపిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నువ్వు నా కెరీర్‌ను ముగించావు. నీ దుర్వినియోగాన్ని నేను ప్రశ్నించాననే కారణంతో ఇలా చేశావా? ఇప్పుడు దేవుడు నీకు ఏమి చేశాడో చూడు. కనీసం కొంతైనా సిగ్గుపడాలి. వేదికలపై నువ్వు నీతులు చెప్పవచ్చు.. కానీ నేను వాటిని ఆచరిస్తాను” అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు.
అయితే ఈ పోస్టులో త్రివిక్రమ్ పేరును పూనమ్ నేరుగా ప్రస్తావించలేదు. ‘ఫేక్ గురూజీ’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించేనని పలువురు నెటిజన్లు భావిస్తున్నారు. గతంలోనూ త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించాలంటూ పూనమ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. పూనమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రతిభ ఉంటే ఎవరూ ఆపలేరని, ఒకరిపై పదేపదే ఆరోపణలు చేసినంత మాత్రాన వారి కెరీర్‌కు నష్టం జరగదని వ్యాఖ్యానించారు.
‘ఆదర్శ కుటుంబం’ సినిమా పూనమ్‌కు నచ్చకపోవచ్చు కానీ ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారని, ఆదివారం కూడా థియేటర్స్ ప్రేక్షకులతో నిండిపోయాయని పేర్కొన్నారు. ‘అజ్ఞాతవాసి’ నుంచి ‘అరవింద సమేత’ వరకు త్రివిక్రమ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, పడటం.. మళ్లీ లేవడం ఆయనకు కొత్తేమీ కాదని కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి పూనమ్ కౌర్ తాజా పోస్టుతో త్రివిక్రమ్‌తో ఆమెకు ఉన్న వివాదం మరోసారి చర్చకు వచ్చింది. ఆమె చేసిన ఆరోపణలపై త్రివిక్రమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

