ఇక చాలు విరామం

‘విరామానికి కూడా ఎక్కడో ఓ చోట ముగింపు పలకాలి. ఎడతెగని విరామ సమయం మనుషుల్లో నిస్తేజాన్ని తీసుకొస్తుంది. అందుకే అర్జెంట్‌గా కెమెరా ముందుకెళ్లాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది అగ్ర కథానాయిక పూజా హెగ్డే. కరోనా థర్డ్‌వేవ్ ప్రభావంతో గత కొంతకాలంగా పెద్ద సినిమాల షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో చాలామంది తారలు ఇంటికే పరిమితమైపోయారు. అయితే ఈ సుదీర్ఘ విశ్రాంతి వల్ల తాను బోర్‌గా ఫీలవుతున్నానని చెప్పింది పూజాహెగ్డే. ఈ మధ్యే వరుస విహారయాత్రలతో ఖాళీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుందీ భామ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఈ సొగసరి తన తదుపరి సినిమాల షూటింగ్స్‌కు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేసింది. ‘త్వరలో సెట్స్‌లో అడుగుపెట్టాలి. సోషల్‌మీడియాలో ఫిల్టర్స్ వేసుకొని చేసే ఎంటర్టైన్మెంట్ నాకు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వడం లేదు’ అని ఇన్‌స్టా స్టోరీలో పూజాహెగ్డే పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘రాధేశ్యామ్’ ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

