
మెదక్, డిసెంబర్ 9 : ఎలాంటి పొరపాట్లు.. సంఘటనలు జరగకుండా మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని పోలింగ్ అధికారులకు ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య సూచించారు. శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో గురువారం మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. 9 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అధికారులు, సెక్టోరల్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులనుద్దేశించి మాట్లాడారు. పోలింగ్ సందర్భంగా వెబ్ కాస్టింగ్ ఉంటుంది కాబట్టి, అం దరూ అధికారులు అప్రమత్తంగా ఉండి, పోలింగ్ కేంద్రంలో ప్రతి అంశాన్ని డేగ కళ్లతో పరిశీలిస్తుండాలని, మీ కనుసన్నల్లో పోలింగ్ జరిగేలా చూడాలన్నారు. పోలింగ్‌లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు, ఆధార్ కార్డు లేదా ఎన్నికల కమిషన్ సూచించిన ఫొటో గుర్తిం పు కార్డును చూపించాల్సి ఉంటుందన్నారు. ప్రాధాన్య క్రమంలో ఎన్నికల అధికారులు ఇచ్చే వయొలెట్ స్కెచ్ పెన్‌తోనే 1,2,3 సంఖ్య రూపంలో ఓటు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. చెక్ లిస్ట్ ప్రకారం 30 రకాల సామగ్రి, ఫారాలు, బ్యాలెట్ బాక్సులను సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ ముగిసిన వెంటనే తిరిగి రిసెప్షన్ కౌంటర్‌కు బ్యాలెట్ బాక్సులు, మెటీరియల్ ఇచ్చే వరకు పూర్తి బాధ్యత ఉంటుందని, ఏమైనా ఇబ్బందులుంటే తక్షణమే అధికారులకు తెలపాలన్నారు ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, స్వీప్ నోడల్ అధికారి రాజిరెడ్డి, తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, ఆర్డీవో సాయి రాం తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్లు వీరే..