బైడెన్ ఆహ్వానాన్ని అంగీకరించిన ప్రధాని మోదీ
పారిస్ వాతావరణ ఒప్పందం | పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వహించే వర్చువల్ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.

న్యూఢిల్లీ : పారిస్ వాతావరణ ఒప్పందంపై ఏప్రిల్ 22, 23 తేదీల్లో నిర్వహించే వర్చువల్ భేటీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. అయితే బైడెన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ భగ్చీ తెలిపారు.
ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఆ మీటింగ్‌లో పాల్గొంటారు. పారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లీ చేరేందుకు బైడెన్ సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సుమారు 40 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. రెండు రోజుల జరిగే మీటింగ్‌లో మోదీతో పాటు ఇతర దేశాధినేతలు కూడా పాల్గొంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాను ఎన్నికైతే ఆ ఒప్పందంలో మళ్లీ చేరుతానని ఎన్నికల వేళ బైడెన్ వాగ్దానం చేశారు. జపాన్ ప్రధాని యోషిహిడే సుగా, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యూ, సౌదీ రాజు సల్మాన్ బిన్ అల్ సౌద్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌లు ఆ సమావేశంలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి..
జర్నలిస్టులకు టీకా ఇవ్వండి.. కేంద్రానికి లేఖ
నేటి నుంచి సికింద్రాబాద్-కాగజ్‌నగర్ ఇటర్సిటీ రైలు
మళ్లీ సిలబస్ తగ్గించేది లేదు: సీబీఎస్సీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

