సెంట్రల్ విస్టా వద్ద ఫొటో, వీడియోగ్రఫీ బ్యాన్
సెంట్రల్ విస్టా వద్ద ఫొటో, వీడియోగ్రఫీ బ్యాన్ | సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శల నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది.

న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శల నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది. ఈ మేరకు నిర్మాణ ప్రాంతంలో సైన్‌బోర్డులు ఏర్పాటు చేసింది. దీనిపై సీపీడబ్ల్యూడీలోని ఓ అధికారిని సంప్రదించగా.. దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టే ‘సెంట్రల్ విస్టా’. కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరించనున్నారు. ప్రసుత్తం కొనసాగుతున్న మహమ్మారి నేపథ్యంలో పలు పౌర సమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణ సంస్థలు ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేయాలని బుధవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రూ.13,450 కోట్ల నిధులను కొవిడ్ సమస్యల పరిష్కారం కోసం వినియోగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇవి కూడా చదవండి..
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య తగ్గని ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి
అమెరికాలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
దయచేసి మాస్కు ధరించండి.. చనిపోయే ముందు ఓ వైద్యురాలి ఆవేదన
సెల్ ఫోన్ కోసం.. 40 కిలోమీటర్ల సైకిల్ సవారీ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

