Pawan Kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చుట్టూ రోజుకో కొత్త అప్డేట్ హల్చల్ చేస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట.
మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు డేట్స్‌లో ఒకటి మాత్రం ఫైనల్ అని అంటున్నారు. రిలీజ్ డేట్‌తో పాటు ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ పవన్ ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరుస్తోంది. ఇటీవల ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి వేసిన హుక్ స్టెప్స్ ఎంతటి వైరల్ అయ్యాయో తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఆ స్టెప్స్‌కు ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్‌తో ఆ హుక్ స్టెప్ ట్రెండ్‌గా మారిపోయింది.
ఇలాంటి హుక్ స్టెప్‌ను ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కూడా చేయించేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను రెడీ చేస్తున్నారట. దర్శకుడు హరీశ్ శంకర్, ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కలిసి పవన్ కోసం స్పెషల్ హుక్ స్టెప్ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. తాజాగా హరీశ్ శంకర్, చంద్రబోస్ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు రావడంతో ఈ టాక్‌కు మరింత బలం చేకూరింది.
ఈ వార్త నిజమైతే పవన్ కళ్యాణ్ స్టైల్లో హుక్ స్టెప్స్ థియేటర్లలో ఫ్యాన్స్‌ను ఊపేస్తాయనే చెప్పాలి. ఇప్పటికే పవన్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుందని అంచనాలు ఉండగా, ఇప్పుడు ఈ హుక్ స్టెప్ సాంగ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుందని భావిస్తున్నారు. పవన్ డాన్స్ స్టెప్స్‌కు థియేటర్లు రచ్చరచ్చే అవుతాయని సోషల్ మీడియాలో అభిమానులు ఇప్పటి నుంచే కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కో అప్డేట్తో అంచనాలను మరింత పెంచేస్తోంది.