చార్మినార్, నవంబర్ 12 : జూపార్కులోని కొమ్ములున్న గుడ్లగూబ (హోర్నేడ్ ఓల్)ను సినీ నటుడు సూర్యతేజ శుక్రవారం దత్తత తీసుకున్నారు. శుక్రవారం జూపార్కును సందర్శించిన ఆయన.. దత్తతకు సంబంధించి రూ.20 వేలను క్యూరేటర్ రాజశేఖర్‌కు అందజేశారు. జూలోని జంతువులను దత్తత తీసుకోవడానికి జంతు ప్రేమికులతోపాటు కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు, వీఐపీలు, సెలబ్రిటీలు ముందుకు రావాలని క్యూరేటర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.