Oppo Reno 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి సరికొత్త మొబైల్‌ను తీసుకురాబోతుంది. ఒప్పో రెనో 16 సిరీస్‌ను జూలై 2వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Oppo Reno 16, Oppo Reno 16c మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో లాంచింగ్‌కు ముందే ఈ మొబైల్‌కు సంబంధించిన కీలక వివరాలను ఒప్పో కంపెనీ విడుదల చేసింది. అయితే.. చైనాలో విడుదలైన వెర్షన్‌కు భిన్నంగా ఈ ఫోన్ భారత మార్కెట్లోకి వస్తుంది.
భారత మార్కెట్లో ఈ ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో తీసుకొస్తున్నట్లు ఒప్పో కంపెనీ ప్రకటించింది. అదే చైనాలో ఈ ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్‌ను వినియోగించడం గమనార్హం. 4nm టెక్నాజీ ఆధారంగా రూపొందించిన Qualcomm Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ గరిష్టంగా 2.8GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గత జనరేషన్ చిప్‌తో పోలిస్తే ఇది 27 శాతం వేగవంతమైన CPU పనితీరు, 30 శాతం మెరుగైన గ్రాఫిక్స్ రెండరింగ్, 65 శాతం మెరుగైన ఏఐ పనితీరును అందించనుంది.
ఈ ఒప్పో రెనో 16 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఏఐ రికార్డింగ్ స్టిక్కర్, ఏఐ స్కాన్, ఏఐ వాయిస్ ట్రాన్స్లేషన్, ఏఐ మెనూ ట్రాన్స్లేషన్, ఏఐ బిల్ మేనేజర్, ఏఐ మైండ్ పైలట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే ఈ ఫోన్లో ప్రత్యేకంగా ఇచ్చిన ఏఐ స్నాప్ కీస్ బటన్ నొక్కడం ద్వారా ఏఐ టూల్స్‌ను వెంటనే ఉపయోగించుకోవచ్చు.
సెక్యూరిటీకి కూడా ఒప్పో పెద్దపీట వేసింది. ఇందులో Oppo Lock పేరుతో అధునాతన యాంటీ థెప్ట్ ఫీచర్‌ను అందిస్తోంది. దీనిద్వారా ఫోన్ పోయినప్పుడు కస్టమర్లు రిమోట్‌గా మొబైల్‌ను లాక్ చేయడంతో పాటు, సిమ్ కార్డు తొలగించకుండా నిరోధించేందుకు వీలుగా SIM Removal Lock సదుపాయం లభిస్తో్ంది.
కెమెరా విషయానికి వస్తే ఈ రెనో 16లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫొటో పోర్ట్రెయిట్ కెమెరా(3.5x ఆప్టికల్ జూమ్, 85mm ఫోకల లెంగ్త్), 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు.
డిజైన్పరంగా ఈ ఫోన్లో హోలోవెర్స్ త్రీడీ డిజైన్లు, ఫ్లోటింగ్ త్రీడీ గ్లిట్టర్ ఫినిష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారత్‌లో Starry White, Stellar Purpe, Twilight Violet కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మొబైల్ విక్రయాలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక వెబ్సైట్, స్టోర్లలో జరగనున్నాయి. చైనాలో విడుదలైన ఈ మోడల్లో 6.32 అంగుళాల డిస్ప్లే, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 6700mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు భారత వెర్షన్లో కూడా కొనసాగనున్నాయి. అయితే ఈ ఫోన్ ధరను మాత్రం వెల్లడించలేదు. రేపటి లాంచింగ్ ఈవెంట్లోనే ఈ మొబైల్ ధరను అధికారికంగా ప్రకటించనున్నారు.