Toxic Glimpse | రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న హై-బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic). ఇప్పటివరకు యష్ లుక్స్, యాక్షన్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన మేకర్స్, తాజాగా ఈ చిత్రంలోని పవర్ఫుల్ మహిళా పాత్రలను పరిచయం చేస్తూ మరింత బోల్డ్‌గా ‘లేడీస్ అండ్ లేడీస్’ (Ladies & Ladies) గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ ఊహించని విధంగా అత్యంత బోల్డ్, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో సాగింది. చిత్రంలో నటిస్తున్న లేడీస్ అందరినీ గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, మరియు రుక్మిణి వసంత్ లతో కూడిన ఈ భారీ లేడీ కాస్టింగ్ గ్లింప్స్‌లో మునుపెన్నడూ చూడని బోల్డ్ అవతార్లలో కనిపించి షాక్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అద్భుతమైన విజువల్స్ ఈ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ‘డాడీ ఈజ్ హోమ్’ అంటూ యష్ ఎంతటి పవర్‌ను చూపించాడో, ఈ లేడీ గ్యాంగ్ అంతకంటే ఎక్కువ ‘టాక్సిక్’గా ఉండబోతోందని ఈ గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది.
కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మరియు యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations) బ్యానర్లపై వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం ఆగస్ట్ 26, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.