Spot Admissions | కోటగిరి, జూలై 1: నిజామాబాద్ జిల్లా కోటగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన జూలై 1 నుంచి 3వ తేదీ వరకు కాలేజీలోనే దరఖాస్తులను స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు.
తమ కాలేజీలో కంప్యూటర్ సైన్స్‌లో 10, ఎలక్ట్రికల్‌లో 14, మెకానికల్‌లో 21 సీట్లు అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 4వ తేదీన ఉదయం 9:30 గంటలకు అన్ని ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలు, ఒక జిరాక్స్ సెట్ తో కళాశాలకు హాజరు కావాలని సూచించారు. అదే రోజు అర్హత నిబంధన ప్రకారం సీట్లు కేటాయిస్తామని తెలిపారు.
స్పాట్ అడ్మిషన్ల ద్వారా ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని తెలిపారు. కాలేజీ ఫీజు మొత్తం విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం 8332919395, 9948264254 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.