నారాయణపేట, జనవరి 2 : భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి న్యాయం పొందే హక్కు కల్పించిందని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. రాష్ట్రంలోని 23 నూతన జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాలను హైకోర్టు సమావేశ మం దిరం నుంచి రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ నవీన్‌రావు తో కలిసి వీసీ నుంచి సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా లీగల్ అథారిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ, కలెక్టర్ శ్రీహర్ష, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం లీగల్ స ర్వీసెస్ అథారిటీ భవనానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా న్యాయాధికార సేవా సంస్థ జిల్లాలో ఏర్పాటు కాడవంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో పేదలు, నిరక్షరాస్యులు, ప్రైవేట్ లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారు ఈ సంస్థ నుంచి ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చన్నారు. జిల్లా యంత్రాం గం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదన పు కలెక్టర్ మయాంక్ మిట్టల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ ఉమర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జాకియా సుల్తానా, పీపీ సురేశ్, డీఎస్పీ సత్యనారాయణ, బార్ అ సోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.