న్యూఢిల్లీ: దవాఖానలనూ కుల మత వివక్ష రోగం పీడిస్తున్నదని తాజా సర్వే వెల్లడించింది. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు వారి కులం, మతం కారణంగా దవాఖానల్లో వివక్షకు గురైనట్టు పేర్కొంది. ఆక్స్‌ఫామ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ పేషెంట్ల హక్కులు, వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే రెండు అంశాలపై ఈ సర్వే నిర్వహించింది.
సర్వేలో పాల్గొన్నవారిలో ‘ముస్లింలు మూడొంతుల మంది, దళితులు, గిరిజనులు 20 శాతానికి పైగా, మొత్తంగా 30 శాతం మంది వైద్యం కోసం దవాఖానలకు వెళ్లినప్పుడు కులం, మతంతో పాటు వ్యాధి, ఆరోగ్య పరిస్థితి కారణంగా తాము వివక్షకు గురైనట్టు తెలిపారని ఆక్స్‌ఫామ్ నివేదిక వివరించింది.దవాఖానానల్లో తమ ఫిజికల్ ఎగ్జామినేషన్‌ను మహిళా సిబ్బంది లేకుండా పురుష సిబ్బందే చేశారని 35 శాతం మంది మహిళలు తెలిపారు.