హైదరాబాద్: మీరెప్పుడైనా అరిటాకులో కేరళ భోజనం తిన్నారా? ఆ రుచికరమైన విందు ఇప్పుడు హైదరాబాద్‌లోనూ దొరుకుతోంది. లూలూ హైపర్‌మార్కెట్(LuLu Hypermarket)లో ఓనం సద్య భోజనం వడ్డించనున్నారు. దీని కోసం ముందస్తు బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఓనం సద్య అంటే కేవలం భోజనం మాత్రమే కాదు.. ఓ అసాధారణ , రుచికరమైన, సంప్రదాయ వంటకాలను వడ్డించే కళే అది. తాము పండించిన పంటను ఇంటికి తెచ్చి కేరళీయులు ఈ వంట పండుగను ఎంతో సంప్రదాయకరంగా జరుపుకుంటారు. కుటుంబసభ్యులందరూ కలిసి అరిటాకులో భోజనం చేసి ఆ అనుభూతిని ఆస్వాదిస్తారు.
అయితే ఓనం సద్య మెనూలో మొత్తం 25 రకాల సంప్రదాయ ఐటమ్లు ఉంటాయి. కుతారి, అవియల్, తోరన్, కాలన్, కూటు, తోరన్, రసం, ఓలన్, పచ్చళ్లతో పాటు ఇంకా అనేక రకాల వంటలను వడ్డించనున్నారు. కూకట్‌పల్లిలోని లూలూ హైపర్మార్కెట్లో ఓనం సద్య ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్ కోసం 7331198961 , 040-46680100 నెంబర్లను సంప్రదించండి. తిరుఓనం సమీపిస్తున్న నేపథ్యంలో వేగంగా బుకింగ్స్ నిండిపోతున్నాయి. ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోండి. డెలివరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రూ.525కే ఒక్కో కిట్ లభిస్తుంది.