OG Ticket Hikes | పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ ధరల అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మల్లేష్ యాదవ్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుకు ముందే సంస్థ సోషల్ మీడియాలో తనను కించపరుస్తూ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ పెట్టిందని ఆరోపిస్తూ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు (కోర్టు ధిక్కారం) కింద నోటీసులు పంపిస్తున్నట్లు మల్లేష్ యాదవ్ ప్రకటించారు.
మల్లేష్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘OG’ సినిమా టికెట్ ధరలపై హైకోర్టు తీర్పు దాదాపు రాత్రి 11:30 గంటలకు వచ్చింది. అయితే, అంతకంటే ముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో మల్లేష్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ కించపరిచేలా ఓ పోస్ట్ పెట్టింది. మల్లేష్ యాదవ్‌కు నైజాం ఏరియాలో ఎక్కడైనా రూ.100 కే టికెట్ ఇస్తామని ఆ పోస్ట్‌లో పేర్కొనడంపై మల్లేష్ యాదవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాజ్యాంగపరంగా తనకు ఉన్న హక్కుతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేసినందుకు, తనను ఇలా కించపరుస్తూ పోస్ట్ పెట్టడం తద్వారా ట్రోల్స్ చేయించడం పూర్తిగా చట్టవిరుద్ధం అని మల్లేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ చర్యపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించడంతో పాటు, క్రిమినల్ కేసు కూడా నమోదు చేస్తున్నట్లు పిటిషనర్ మల్లేష్ యాదవ్ తెలిపారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నోటీసులు పంపిస్తున్నాను
OG టికెట్ ధరల గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మల్లేష్ యాదవ్ వ్యాఖ్యలు
హైకోర్టు తీర్పు దాదాపు రాత్రి 11:30 గంటలకు వస్తే, అంతకముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తమ అఫిషియల్ X(ట్విట్టర్)… pic.twitter.com/tHtMH7NvJJ
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2025