ఆఫీస్ ఫిట్-అవుట్‌కు హైదరాబాద్‌లో వ్యయం తక్కువ

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశంలో కొన్ని ప్రధాన నగరాలకంటే హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ ఫిట్-అవుట్ (స్పేస్‌ను వివిధ ఫిట్టింగ్స్‌తో ఆఫీస్‌గా మార్చడం) వ్యయం తక్కువగా ఉందని రియల్టీ సర్వీసుల సంస్థ జేఎల్ఎల్ ఇండియా పేర్కొంది. జేఎల్ఎల్ ఆసియా పసిఫిక్ ఫిట్-అవుట్ కాస్ట్ గైడ్ 2021-22 ప్రకారం ముంబై నగరంలో చదరపు మీటరుకు ఫిట్అవుట్ వ్యయం రూ. 61,050కాగా, హైదరాబాద్‌లో ఇది రూ.53,850గా ఉంది. అయితే ముడిపదార్థాల ధరలు పెరగడంతో ఈ సంవత్సరం ఆఫీస్ స్పేస్ ఫిట్-అవుట్ వ్యయాలు 8 శాతం అధికమయ్యాయని జేఎల్ఎల్ తెలిపింది. కొవిడ్-19తో సరఫరా ఆటంకాలు, లేబర్ కొరత సైతం ఫిట్-అవుట్ వ్యయాల పెరుగుదలకు కారణమైనట్లు జేఎల్ఎల్ గురువారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. పలు సంస్థలు వాటి కార్యాలయాల్ని పునర్ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆఫీస్ ఫిట్-అవుట్స్ వ్యయాలు మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు జేఎల్ఎల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంవీ హరీష్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

