ఓసీడీ కార్డు ఉంటే చాలు: నో నీడ్ ఓల్డ్ పాస్‌పోర్ట్!
ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్స్ (ఓసీఐ) కార్డు| ఓసీఐ కార్డు గల ఓవర్సీస్ ఇండియన్లు పాత/కాలం చెల్లిన పాస్‌పోర్టు తేనవసరం లేదని భారత ఎంబసీ తెలిపింది.

వాషింగ్టన్: బారత దేశానికి వెళ్లే ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్స్ (ఓసీఐ) కార్డు గల భారత సంతతి వ్యక్తులు, ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ ఇచ్చింది. స్వదేశానికి వెళ్లే ఓసీఐ కార్డు హోల్డర్లు.. పాత, గడువు పూర్తయిన పాస్‌పోర్టులను వెంట తెచ్చుకోనవసరం లేదు. ఇంతకుముందు అందరితోపాటు ఓసీఐ కార్డు దారులు కూడా తమ పాత/ గడువు పూర్తయిన పాస్‌పోర్టులను వెంట తెచ్చుకోవాల్సి ఉండేది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని భారతీయ ఎంబసీ తన వెబ్సైట్లో ప్రకటన చేసింది.
కొత్త పాస్‌పోర్ట్ ఉంటే సరి
ఓసీఐ కార్డుతోపాటు పాత పాస్‌పోర్టులను వెంట తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదని భారత ఎంబసీ పేర్కొన్నది. కొత్త పాస్‌పోర్ట్ మాత్రం వెంట తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. పాత పాస్‌పోర్ట్ నంబర్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు గడువును పలు దఫాలు పొడిగించింది. ఓవర్సీస్ ఇండియన్లు ఓసీఐ కార్డులతోపాటు పాత పాస్‌పోర్టులను వెంట తెచ్చుకోవాలన్న మార్గదర్శకాలను కేంద్రం సడలించడం ఇదే తొలిసారి.
కేంద్రం ముందుకు ప్రవాసులు ఇలా
ఇంతకుముందు స్వదేశానికి వచ్చినప్పుడు ఓసీఐ కార్డు ఉన్నా పాత/ గడువు పూర్తయిన పాస్‌పోర్ట్‌లను వెంట తెచ్చుకోవడం ఇబ్బందికరంగా ఉందంటూ ప్రవాస భారతీయులు తమ ద్రుష్టికి తేవడంతో ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం తీసుకొచ్చింది.దీనికి తోడు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు విదేశాల్లో ఉండే భారతీయులు, ప్రవాసులు ఓసీఐ కార్డు పొందేందుకు కేంద్రం గడువు పొడిగించింది.
కరోనాతో నిబంధనల సడలింపు
2005 నుంచి అమలులో ఉన్న ఓసీఐ గైడ్‌లైన్స్ ప్రకారం కార్డు హోల్డర్ నూతన పాస్‌పోర్ట్ తీసుకున్న ప్రతి సారీ ఓసీఐ కార్డు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిబంధనలను గతేడాది నుంచి కేంద్రం సడలించింది.20 ఏండ్ల లోపు మొదలు 50 ఏండ్లు దాటిన వారికి మరోమారు ఓసీఐ కార్డులను కేంద్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వనున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
మయన్మార్ మిలిటరీతో అదానీ గ్రూప్ డీల్.. బయటపడిన సంచలన నివేదిక
మహిళా సహాయకురాలితో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి అసభ్య ప్రవర్తన
దేశభక్తులకే పార్లమెంట్.. హాంకాంగ్‌పై చైనా పెత్తనం
శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్.. 87 శాతం సంస్థల మాట ఇదే
అప్పుపై కొనే కంటే లీజు కారు చౌక!
ఇండ్లకు డిస్కౌంట్ల బోనంజా.. దేశమంతా ‘డబుల్’ ప్రియారిటీ!
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

