లండన్, ఫిబ్రవరి 9: నక్షత్రాలు ప్రకాశించడానికి కారణమైన కేంద్రక సంలీన (న్యూక్లియర్ ఫ్యూజన్) ప్రక్రియను ఐరోపా శాస్త్రవేత్తలు భూమిపైనే జరిపించారు. రెండు హైడ్రోజన్ అణువులను కలపడం ద్వారా ఐదు సెకన్లలో 59 మెగాజౌళ్ల (11 మెగా వాట్లు) శక్తిని ఉత్పత్తి చేశారు. యూకేలోని జెట్ ల్యాబ్‌లో ఈ ప్రయోగం నిర్వహించారు. శాస్త్రవేత్తలు గతంలోనూ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం జరిపిన కేంద్రక సంలీన ప్రక్రియలో ఉత్పత్తి అయిన శక్తి రెట్టింపు కావడం విశేషం. కొత్త తరహా న్యూక్లియర్ రియాక్టర్‌తో ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రియాక్టర్ నిర్మాణం అధారంగా భవిష్యత్తులో మరింత శక్తిమంతమైన వాటిని తయారు చేయడానికి వీలు కలుగుతుందని పేర్కొన్నారు.