Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Study in USA | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కఠిన వలస విధానాలు, వీసా తనిఖీలు, అపాయింట్మెంట్లలో జాప్యంతో ఈ ఏడాది అక్కడి యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు తగ్గుముఖం పట్టాయి.
Study in USA | వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన కఠిన వలస విధానాలు, వీసా తనిఖీలు, అపాయింట్మెంట్లలో జాప్యంతో ఈ ఏడాది అక్కడి యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో విద్యార్థులు యూరప్, ఆసియా దేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారని తేలింది. సీటెల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో వరుసగా రెండో ఏడాది విద్యార్థుల సంఖ్య పదేండ్ల కనిష్ఠానికి చేరింది.
ఒహియో స్టేట్ వర్సిటీలో 13 శాతం తగ్గి 16 ఏండ్లలో అత్యల్ప స్థాయికి చేరింది. ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల తగ్గుదలతో తన ఎండోమెంట్ నిధుల నుంచి 200 మిలియన్ డాలర్ల వరకు అప్పు తీసుకోవాలని యోచిస్తున్నది. వీసా జాప్యాలు కరోనా సమయంలో కంటే ఈ వేసవిలో దారుణంగా ఉన్నాయని ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ డైరెక్టర్ ఫాంటా అవ్ తెలిపారు.
తాజా సర్వేలో ఆగస్టు-అక్టోబర్ మధ్య యూరప్‌లో 50 శాతం కళాశాలల్లో అండర్గ్రాడ్యుయేట్, ఆసియాలో 59 శాతం విద్యాసంస్థల్లో పీజీ విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఎఫ్-1 వీసాదారులు చదువు తర్వాత సంబంధిత రంగంలో పనిచేసేందుకు ఉపయోగపడే ఓపీటీ కార్యక్రమానికి ఒక్కో విద్యార్థి 70 వేల డాలర్లు చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. కొన్ని కొత్త హెచ్-1బీ పిటిషన్లకు లక్ష డాలర్లకు పైగా ఫీజుల ప్రతిపాదన కూడా ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Encephalitis | పిల్లల్లో మెదడువాపు.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Bigg Boss 10 | హౌస్‌లో నామినేషన్ల మంటలు.. ముకేశ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన మిథిలేష్, వర్షిణిపై అపూర్వ సంచలన వ్యాఖ్యలు!
Study in USA | ట్రంప్ దెబ్బతో అమెరికా చదువులకు బైబై.. యూరప్‌కు వరుస కట్టిన విదేశీ విద్యార్థులు
Local Body Elections | ఎన్నికల జాప్యంతో కేంద్రం షాక్.. తెలంగాణకు రావాల్సిన రూ.1,700 కోట్లు పెండింగ్
Farmer | మంత్రి వివేక్ ఇలాకాలో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

