పెన్పహాడ్, జూన్ 15 : పెన్పహాడ్ మండలం అనాజీపురం ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6, 7, 8వ తరగతితో పాటు ఇంటర్ ఫస్టియర్ వివిధ గ్రూపుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ కోడి లింగయ్య సోమవారం పేర్కొన్నారు.
6వ తరగతి – 30 సీట్లు
7వ తరగతి – 25 సీట్లు
8వ తరగతి – 10 సీట్లు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC – 10 సీట్లు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం CEC – 15 సీట్లు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ACE – 25 సీట్లు
అర్హత కలిగిన విద్యార్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, అవసరమైన పత్రాలతో ఈ నెల 16, 17 తేదీల్లో పాఠశాలకు హాజరై స్పాట్ అడ్మిషన్ పొందాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9989636205 ను సంప్రదించాల్సిందిగా ప్రిన్సిపాల్ సూచించారు.