FIFA : ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ అభిమానులను అలరిస్తోంది. ఈసారి సాకర్ పండుగ ప్రత్యేకత ఏంటంటే.. మునుపెన్నడూ లేని విధంగా గోల్ నిర్దరణ కోసం క్రికెట్ పరిజ్ఞానం ఉపయోగించారు. క్రికెట్లో చాలా సాధారణంగా కనిపించే స్నికో మీటర్(Snicko Meter) వాడకం అందరిలోనూ ఆసక్తి రేపింది. స్వీడన్, ట్యునీషియా మ్యాచ్‌లో స్నికో మీటర్ ఆధారంగా గోల్ వేసింది ఎవరు? అనేది నిర్ణయించారు.
గ్రూప్ ఎఫ్‌లోని స్వీడన్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ట్యునీషియాపై 5-1తో జయబేరి మోగించి ముందంజ వేసింది. అయితే.. మ్యాచ్‌లో నాలుగో గోల్ నిర్దరణపై ఉత్కంఠ నెలకొనగా రిఫరీలు క్రికెట్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. క్రికెట్లో బ్యాట్‌కు బంతి తగిలిందా? లేదా? అనేది తెలుసుకోవడం కోసం ఉపయోగించే ఈ సాంకేతికతను గోల్ నిర్ధరణకు వాడారు. సబిస్టిట్యూట్‌గా వచ్చిన మాట్టియాస్ స్వాన్బెర్గ్ 18 సెకన్లలోనే గోల్ కొట్టగానే స్వీడన్ ఆటగాళ్లు సంబురాల్లో మునిగిపోయారు.
Cricket-style “Snicko” technology used in FIFA World Cup 🏏⚽️
VAR uses Snicko to check a faint touch by Isak in the build-up to Sweden’s fourth goal vs Tunisia, overturning an offside call and awarding the goal.
Read Here👇#FIFAWorldCuphttps://t.co/tHdtKTZR4p
— India Today Sports (@ITGDsports) June 15, 2026
అయితే.. అసిస్టెంట్ రిఫరీ మాత్రం కార్డు చూపిస్తూ గోల్ కాదని చెప్పాడు. దాంతో, స్వీడన్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అలెగ్జాండర్ ఇజాక్ కాలు సైతం తగిలినట్టు అనిపించడంతో గోల్ కొట్టింది ఎవరు? అనేది తేల్చడం కోసం రిఫరీలు స్నికో మీటర్ సాయం తీసుకున్నారు. స్నికోలో ఇజాక్ కాలు దాటిన తర్వాత స్పైక్ కనిపించింది. సో.. ఆ గోల్ కొట్టింది స్వాన్బెర్గ్ అని తేలింది.