సాగర్ ఉపఎన్నిక : ముగిసిన నామినేషన్ల పర్వం
సాగర్ ఉపఎన్నిక నామినేషన్లు | సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రిమ ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు.

హైదరాబాద్ : సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ఎస్ పార్టీ నుంచి నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి, బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్, టీడీపీ అభ్యర్థి మువ్వా రవికుమార్ తమ నామినేషన్లు దాఖలు చేశారు.
కరోనా నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ సాదాసీదాగా సాగింది. నిడమనూరు తాసిల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రోహిత్ సింగ్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్నిపార్టీల అభ్యర్థుల రాకతో నిడమనూరులో ఎన్నికల కోలహలం కనిపించింది.
నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పలువురు స్వతంత్ర అభ్యర్థులు, వివిధ చిన్నాచితకా పార్టీలకు చెందిన 20 మంది ఇప్పటికే 23 నామినేషన్లు దాఖలు చేశారు.
ఇవాళ మరో 30పైకి నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని సమాచారం.
జానారెడ్డి 11వ సారి..

కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 11వ సారి నామినేషన్ దాఖలు చేశారు.
తొలిసారి ఆయన జనతా పార్టీ నుంచి 1978లో నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు 10 సార్లు పోటీ చేయగా ఏడుసార్లు గెలుపొందారు. 3 సార్లు ఓటమి చవిచూశారు.
పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే నిమ్మల రాములు చేతిలో, 1994లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్య చేతిలో జానారెడ్డి ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జున సాగర్‌లో బీజేపీ చతికిల!
నామినేషన్ దాఖలు చేసిన నోముల భగత్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

