SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
SI Lingam | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్సై లింగం హెచ్చరించారు.
రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బెల్ట్ షాపులు ( Belt shops) నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్సై లింగం ( SI Lingam ) హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చట్టాన్ని( Law ) చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా విద్యార్థులు, యువకులు గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములై మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. గంజాయి, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలు, గుట్కా జూదం వంటి అంశాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఆయన పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు సహకరించాలని కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- belt shops
- law
- No tolerance
- Rayapol
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

