కొవిడ్-19 కేసులెక్కువైనా.. విమానాలు రద్దు చేయం!

న్యూఢిల్లీ: దేశంలో మలి విడుత కొవిడ్-19 కేసులు పెరుగుతున్నా జాతీయంగా వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులను నిలిపివేయబోమని కేంద్ర పౌర విమానయానశాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. మలి విడుత కేసులు పెరుగడం వల్లే దేశవ్యాప్తంగా 100 శాతం విమాన సర్వీసులు నడుపలేకపోతున్నామన్నారు.
ప్రస్తుత పరిస్థితులు ప్రజలు ప్రయాణించడానికి సేఫెస్ట్ మోడ్ విమాన ప్రయాణమేనని హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. కరోనా మార్గదర్శకాలను, నిబంధనలను పాటించని వారిపై సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ విమానాశ్రయం టర్మినల్ విస్తరణ వల్ల దేశంలో అభివ్రుద్ధి చెందుతున్న 2-3 శ్రేణి విమానాశ్రయాల్లో గోరఖ్‌పూర్ ఒకటిగా నిలుస్తుందన్నారు. గోరఖ్‌పూర్ విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం శంకుస్థాపన చేస్తారు.
కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ వచ్చే మే నెలాఖరు నాటికి పూర్తి కావచ్చునని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. ఎయిర్ ఇండియా ఇప్పటికీ రూ.60 వేల రుణాల ఊబిలో చిక్కుకున్నదని, ఈ పరిస్థితుల్లో దాన్ని విక్రయించక తప్పడం లేదని తెలిపారు. దీంతోపాటు మరో పీఎస్‌యూ విమానయాన సంస్థ పవన్ హన్స్ వంటి సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు.
ఇవి కూడా చదవండి:
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
మీడియా, వినోద రంగం కోలుకున్నట్టే
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
ప్రభుత్వ బ్యాంకులకే మొండి బాకీల సమస్య!
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

