‘మహాత్మ’కు మొండిచెయ్యి!
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆదివారం జీవో 142 విడుదల చేసింది. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మొదటి విడత భర్తీ ప్రక్రియలో ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కూడా కేటాయించకపోవడంపట్ల జిల్లాలోని ఆశావహులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పటికీ జిల్లాలోని ఏకైక వర్సిటీకి అన్యాయం జరుగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఎంజీయూకు ఒక్క పోస్టూ కేటాయించని సర్కార్
- ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యార్థి సంఘాల ఆగ్రహం
రామగిరి, అక్టోబర్ 18: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆదివారం జీవో 142 విడుదల చేసింది. నల్లగొండలో మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మొదటి విడత భర్తీ ప్రక్రియలో ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు కూడా కేటాయించకపోవడంపట్ల జిల్లాలోని ఆశావహులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పటికీ జిల్లాలోని ఏకైక వర్సిటీకి అన్యాయం జరుగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2007లో ప్రారంభమైన ఎంజీయూకు ఇప్పటి వరకు 32 మంది అధ్యాపకులనే ఫ్రభుత్వం నియమించిందని, మిగిలిన విభాగాలు కాంట్రా క్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నాయని ఆరోపిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన యూనివర్సిటీ కాలే జ్ ఆఫ్ లా, ఫార్మసీలకు కొత్త పోస్టులు మంజూరు చేసి నా ప్రస్తుత భర్తీ ప్రక్రియలో వాటి నియామకానికి అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని విమర్శించారు. మిగిలిన యూనివర్సిటీలకు భర్తీ అవకాశం ఇచ్చిన సర్కార్ ఎంజీయూపై సవతితల్లి ప్రేమ చూపిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

