కళాజీవి
అతడొక నిశ్శబ్ద కవితాఝరి నిరంతర మృదుల గానలహరి మేఘసందేశం, గీతాంజలుల అనుసృజనకారుడై
అతడొక నిశ్శబ్ద కవితాఝరి
నిరంతర మృదుల గానలహరి
మేఘసందేశం, గీతాంజలుల అనుసృజనకారుడై
అనువాదాలలో అందెవేసిన చేయిగా
ఎందరో ఆంగ్లకవులను తెనుగీకరించి
ఉత్తమ అనువాదకుడి పురస్కారం
పొందిన ద్విభాషా సవ్యసాచి
తన అజ్ఞాత ప్రేమను కవిత్వంలోకి ఒంపి
ప్రేమ కవిత్వానికి చిరునామాగా
‘మేఘరాగరంజని’ని నిలిపిన ప్రణయకవి
ప్రపంచాన్ని కళ్లల్లో చిత్రికపట్టి
గురువుకు ఆయన చిత్రపటాన్నే
గురుదక్షిణగా ఇచ్చిన శిష్య చిత్రకారుడు
సినీగీతాల్ని ఔపోసనపట్టి
తన గాత్రంతో శ్రోతల హృదయాల్లో
నిలిచిపోయిన మధుర గాయకుడు
ఒకే కన్నుతో ఒంటరి జీవనయానంలో
ఆటుపోట్లకు ఎదురునిలిచిన ధీరుడై
మిత్రుల గుండెల్లో ఆప్తమిత్రుడైన స్నేహపాత్రుడు
నీ అకాల నిష్క్రమణ కలయా! నిజమా!
తేల్చుకోలేని సందిగ్ధంలో మిత్రలోకం
హితుడా..మా గుండెల్లో
ఎప్పటికీ చెరిగిపోని సంతకం నీవు
మా జ్ఞాపకాల్లో మిగిలిపోయే
అసంపూర్ణ కావ్యం నీవు
(ప్రియ స్నేహితుడు, గురుతుల్యుడు డా.రఘువర్మస్మృతిలో..)
-ప్రొ. బాణాల శ్రీనివాసరావు
9440471423
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

