మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
మహానగర వాసులకు రవాణా కష్టాలు తీరుస్తున్న మెట్రో రైలుకు ఆర్థిక నష్టాల సెగ తగులుతోంది. రాకపోకలతో ఓ వైపు ఆదాయం పెరుగుతున్నా... భారీ వ్యయాలు, తడిసి మోపెడవుతున్నాయి. రుణాలపై వడ్డీల కారణంగా మెట్రో బండి పరుగులు నష్టాల ఊబిలో చికుకుంటున్నాయి.
- పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు.. తడిసిమోపెడవుతున్న వడ్డీ భారం
- ఏడాది కాలంలో మరో రూ.25.40 కోట్లు పెరిగిన నష్టాలు
- ఆర్థిక సుడిగుండంలో ప్రాజెక్టు
మహానగర వాసులకు రవాణా కష్టాలు తీరుస్తున్న మెట్రో రైలుకు ఆర్థిక నష్టాల సెగ తగులుతోంది. రాకపోకలతో ఓ వైపు ఆదాయం పెరుగుతున్నా… భారీ వ్యయాలు, తడిసి మోపెడవుతున్నాయి. రుణాలపై వడ్డీల కారణంగా మెట్రో బండి పరుగులు నష్టాల ఊబిలో చికుకుంటున్నాయి. 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా రూ.405.86 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 380.46 కోట్లుగా ఉన్న నష్టాలు, ఏడాది వ్యవధిలోనే మరో రూ.25.40 కోట్లకు పెరిగింది. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి తన చేతికి తీసుకోవడమే ప్రభుత్వ ఖజానాకు శాపంగా మారింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 18
(నమస్తే తెలంగాణ) : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల కాలంలో మెట్రో రైలు కార్యకలాపాలు, ఇతర మార్గాల ద్వారా మొత్తం రూ. 524.78 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ. 497.54 కోట్లతో పోలిస్తే ఆదాయం రూ.27.24 కోట్లు మేర పెరిగింది. ప్రయాణికుల రవాణా మెరుగవుతున్నప్పటికీ, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తట్టుకునేందుకు ఈ ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. ఇదే సమయంలో మెట్రో నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీత భత్యాలు, పరిపాలనా వ్యయాలు, తరుగుదల, రుణాలపై వడ్డీలు అన్నీ కలిపి ప్రస్తుత అర్థ సంవత్సరంలో రూ. 930.64 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయాలు రూ. 878 కోట్లుగా ఉండగా, ఇప్పుడు మరింత పెరిగింది. కేవలం మెట్రో రైళ్ల నిర్వహణకే రూ. 222.88 కోట్లు ఖర్చయినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దినదినం వడ్డీ భారమే..3
మెట్రో ఆర్థిక పరిస్థితిని కుంగదీస్తున్న వాటిలో ప్రధానమైనది రుణాలే. గతంలో వీటిని ఎల్ అండ్ టీ నిర్వహణ సంస్థనే భరించేది. మెట్రో మొదటి దశ కోసం తీసుకున్న రుణాలపై ఎల్ అండ్ టీ సగటున 7 నుంచి 8 శాతం వరకు వడ్డీ చెల్లించేది. కానీ.. స్వాధీనం పేరిట సర్కార్ చేసిన తప్పిదం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కేవలం ఫైనాన్స్ ఖర్చుల రూపంలోనే రూ. 522.61 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అంటే మెట్రోపై రుణాల వడ్డీ భారం రోజుకు సగటున సుమారు రూ. 2.85 కోట్లుగా ఉంటోంది వస్తున్న ఆదాయమంతా వడ్డీల చెల్లింపులకే సరిపోతుండటంతో ఆర్థిక ఫలితాల్లో ఎలాంటి మెరుగైన స్థితి కనిపించడం లేదు. ఈ భారీ ఆర్థిక భారాల నుంచి మెట్రోను గట్టెకించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్టును ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా.. ఉన్న రుణాలను రీ షెడ్యూల్ చేసి వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తామని సర్కార్ చెబుతుంది. కానీ ఇప్పటివరకు ఇప్పుడున్న వడ్డీ శాతానికి కంటే తక్కువతో రుణాలు ఇచ్చే సంస్థలు ముందుకు రాలేదు. వడ్డీ రేటును 3.5 నుంచి 4 శాతం లోపునకు కుదించగలిగితే మెట్రో ఆర్థిక ముఖచిత్రం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం తకువ వడ్డీకి రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు ముందుకు వచ్చే బ్యాంకులను అన్వేషిస్తూనే ఉన్నారు. సరార్ తలపెట్టిన ఈ స్వాధీన ప్రక్రియ ఎప్పుడు కొలికి వస్తుంది? రుణాల పునర్వ్యవస్థీకరణ ఏ మేరకు ఫలితాలనిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

