మిషన్.. పారాహుషార్!
ఇస్రో-నాసా సంయుక్త ప్రాజెక్టు ‘నిసార్’
విపత్తులను ముందే పసిగట్టి హెచ్చరికలు
సెంటీమీటర్ స్థాయిలో జరిగే మార్పులనూ గుర్తించే టెక్నాలజీ
మరో ఏడాదిలో ప్రయోగం.. మూడేండ్ల పాటు సేవలు

బెంగళూరు: ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి.. అధికారులను అప్రమత్తం చేస్తూ.. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రారంభమైన ‘నాసా-ఇస్రో సార్’ (నిసార్) సంయుక్త ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అగ్రశ్రేణి రోదసి సంస్థలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. దీంట్లోభాగంగా అత్యంత స్పష్టమైన చిత్రాలను తీసే ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీకి చెందిన సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) పేలోడ్‌ను తాజాగా ఇస్రో అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవలే నాసాకు తరలించారు. ఈ ‘ఎస్-బ్యాండ్ సార్ పేలోడ్’ను నాసా అభివృద్ధి చేయనున్న ‘ఎల్-బ్యాండ్ సార్ పేలోడ్’కు అనుసంధానించనున్నారు.
ఏమిటీ ప్రయోగం?
భూ ఉపరితల పరిశీలన కోసం ‘నిసార్’ మిషన్‌ను చేపట్టారు. రెండు ఫ్రీక్వెన్సీలతో రాడార్లను ఉపయోగిస్తూ ప్రయోగిస్తున్న తొలి మిషన్ ఇదే. ఇందులో ఎస్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్‌ను ఇస్రో అభివృద్ధి చేయగా, ఎల్-బ్యాండ్ ఫ్రీక్వెన్సీ రాడార్‌ను నాసా అభివృద్ధి చేయబోతుంది. ఈ రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లతో కూడిన రాడార్లను వినియోగించడం వల్ల భూమి ఉపరితలంలోని మార్పులను చదరపు సెంటీమీటర్ రేంజ్ వరకు కూడా స్పష్టంగా అంచనా వేయవచ్చు. ‘నిసార్’పై 2014లో ఇస్రో, నాసా అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2022లో శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగిస్తారు.
మిషన్ ఉపయోగాలు
అడవుల నరికివేత, మైనింగ్ తదితరాల వల్ల నేల, వాతావరణంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయన్న దాన్ని ఈ మిషన్ ద్వారా కనిపెట్టనున్నారు. దీంతో భూకంపాలు, సునామీ, అగ్ని పర్వతాల విస్పోటనం వంటి విపత్తులను ముందుగా గుర్తించి ప్రజలను హెచ్చరిస్తారు. ఈ మిషన్ మూడేండ్ల పాటు సేవలను అందించనున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ISRO
- NASA
- NISAR satellite
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

