నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘స్పై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ బ్లాక్ జాకెట్ ధరించి చేతిలో తుపాకీతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన సరికొత్త గెటప్ అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ ఏడాది దసరా కానుకగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమాలో నిఖిల్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఆయన చేపట్టే ఆపరేషన్ ఏంటనేది ఆసక్తిని పంచుతుంది. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఐశ్వర్యమీనన్, అభినవ్ గోమటం, సన్యా ఠాకూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జూలియన్ ఎస్ట్రాడా, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ప్రొడక్షన్ డిజైనర్: రవి ఆంథోని, కథ, నిర్మాత: కె.రాజశేఖర్ రెడ్డి, సీఈఓ: చరణ్‌తేజ్, ఎడిటర్, దర్శకత్వం: గ్యారీ బిహెచ్.