అక్షరం లక్షల భావాల్ని వ్యక్తం చేస్తుంది. మరి పద్దెనిమిది పుటల్లో నిక్షిప్తమై ఉన్న అక్షరాల మాటున అంతరార్థం ఏమిటో తెలుసుకోవాలంటే మా ‘18పేజీస్’ సినిమా చూడాల్సిందే’ అంటున్నారు పల్నాటి సూర్యప్రతాప్. ఆయన నిర్దేశకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18పేజీస్’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్టోరీని అందిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, వినూత్న కథాంశంతో అన్ని వర్గాలకు నచ్చే చిత్రమిదని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వసంత్, రచన: శ్రీకాంత్ విస్సా, సంగీతం: గోపీసుందర్, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణ సంస్థలు: జీఏ2పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్, కథ: సుకుమార్, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్.